అన్ని వర్గాల ప్రజల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఎమ్మార్పీఎస్ దక్షిణ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చింతా బాబు మాదిగ అన్నారు.శుక్రవారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని పెద్ద మసీదు వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులకు, బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించిన మహా నాయకుడని కేవలం దళితులకే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాంగంలో హక్కులు కల్పించారని అంబేద్కర్ అందరివాడు అని ఆయన చేసిన సేవలను కొనియాడారు. వారి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు.పట్టణ అధ్యక్షులు ఏర్పుల చిన్ని మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ ఇన్చార్జ్ బాణాల అబ్రహం, జిల్లా నాయకులు ఏర్పుల శ్రావణ్ కోదాడ మండల అధ్యక్షులు నారకట్ల ప్రసాద్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు మాతంగి శ్రీనుమాదిగ, స్టూడెంట్ ఫెడరేషన్ నియోజకవర్గం నాయకులు పిడమర్తి బాబురావు, కలకొండ వెంకట నారాయణ, సోమపొంగుశ్రీను, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు……….