కోదాడకు చెందిన షేక్ ఇఫ్రా టిఎస్ ఆర్జెసి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 150 మార్కులకు గాను 138మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించింది. ఇఫ్రా పదవ తరగతి జయ స్కూల్ లో 578 మార్కులు సాధించింది. తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ సొసైటీ నిర్వహించిన సీఈఓ లో కూడా 80 కు గాను 69 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించింది. కాగా ఇఫ్రా తండ్రి నడి గూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అర్ద శాస్త్ర అధ్యాపకునిగా పని చేస్తున్నారు.