చిలుకూరు మండలం న్యూస్ TNR NEWS
రాష్ట్రవ్యాప్తంగా సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు శుక్రవారం మండల విద్యాధికారి గురవయ్యకు సమ్మె నోటీసు ఇచ్చి నిరసనను తెలియజేశారు. నేటి నుండి మూడు రోజులపాటు నిరసన కార్యక్రమాలను పాటిస్తామని అనంతరము మా డిమాండ్లను ప్రభుత్వము తీర్చకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని చిలుకూరు ఉద్యోగ సంఘాలు తెలియజేశాయి. సమగ్ర శిక్షణ రెగ్యులరైజ్ చేసి స్కేలు చెల్లించాలని ప్రతి ఉద్యోగికి జీవిత బీమా ఆరోగ్య భీమా కల్పించాలని వారి డిమాండ్లను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తేజ రెడ్డి స్పందన విజయనిర్మల కవిత రాధా ఝాన్సీ రాణి సుమలత మల్లె పంగు శ్రీనివాసరావు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.