వరంగల్ :
గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ పరిధిలోని కాశీబుగ్గ వివేకానంద కాలనీ లో గురువారం రోజు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. వివేకానంద కాలనీలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ పనులు సరిగా జరగట్లేదని, దుర్వాసన కూడా వస్తుందని ఇటీవల స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్ అధికారులు స్పందించి గత రెండు రోజులుగా కాలనీలోని పారిశుద్ధ పనులను నిర్వహించేలా చేశారు. కాలనీలోని ఉన్నటువంటి కాలనీవాసులకు మున్సిపల్ అధికారులు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం వేయకూడదని చెత్తకుండీలలోనే వేయాలని చెప్పారు.