కోదాడ పట్టణంలోని 22వ వార్డులో నిరుపేద కుటుంబానికి చెందిన పోలిమెట్ల పాపారావు, నిర్మల దంపతులు ఎన్నో ఏండ్లుగా అద్దే ఇంట్లో నివాసం ఉంటున్నారు.ప్రమాదవశాత్తు ఇంట్లో విద్యుత్ షాక్ సర్క్యూట్ తో గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. దిక్కుతోచని స్థితిలో ఉన్న బాధిత కుటుంబానికి అవార్డులో ఉన్న స్థానికులు అంతా కలిసి మానవతా దృక్పథంతో 25వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు. ఆపదలో ఉన్న కుటుంబాన్ని ఆదుకునేందుకు దాతలు ముందుకు వచ్చి సహాయ, సహకారాలు అందించాలని పలువురు కోరారు. ఆర్థిక సహాయం అందించిన వారిలో భాగం కోటయ్య,
చందా నరసయ్య,చంద్రశేఖర్ రెడ్డి,పత్తిపాక జనార్దన్ వర్మ,కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి,మొరపురెడ్డి చలమ రెడ్డి,
సాపాటి గోపిరెడ్డి,బోధ సత్యనారాయణరెడ్డి,నట్టెం వెంకట్రావు,ధనాల కొండయ్య,త్రిపురనేని సుబ్బారావు,వెలిశాల పురుషోత్తం కుమార్,
దేవి రెడ్డి వెంకట్ రెడ్డి,పత్తిపాక శైలజ తదితరులు పాల్గొన్నారు……