ముస్తాబాద్ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు. ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి అనంతరం తెలంగాణ చౌక్ వద్ద, తెలంగాణ తల్లి విగ్రహానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు మాట్లాడుతూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు తెలంగాణ తల్లికి పాలభిషేకం నిర్వహించినట్లు తెలిపారు,ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించేది తెలంగాణ తల్లి విగ్రహం కాదని కాంగ్రెస్ తల్లి విగ్రహమని మండిపడ్డారు. తెలంగాణ తల్లి చేతిలో ఉండే బతుకమ్మను తీసేసి కాంగ్రెస్ చేతి గుర్తును పెట్టడన్నీ తీవ్రంగా కండిస్తున్నామని అన్నారు.2009 నవంబర్ 29న కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఆమరణ నిరాహార దీక్షకు పూునుకోగ డిసెంబర్ 9 న కేంద్రంలో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టడంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర విజయోత్సవంగా పాలాభిషేకం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి. సెస్ డైరెక్టర్ చందుపట్ల అంజిరెడ్డి. మాజీ మండల అధ్యక్షులు కొమ్ము బాలయ్య. మాజీ జెడ్పి ఆప్షన్ సర్వర్ పాషా. మాజీ సర్పంచ్ నల్ల నరసయ్య. యాది మల్లేష్. సంతోష్. మహిళా నాయకురాలు కుర్ర సావిత్రి. స్వర్ణ మంజుల. నాయకులు శీలం స్వామి నవాజ్ చెవుల మల్లేశం జాంగిర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.