విశ్రాంత ఉద్యోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి సంక్షేమం కోసం రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తానని అందోల్ జోగిపేట మున్సిపల్ 17వ వార్డ్ కౌన్సిలర్ ఆకుల చిట్టిబాబు అన్నారు. తెలంగాణ విశ్రాంత ఉద్యోగుల సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సంఘం భవనంలో నిర్వహించిన విశ్రాంత ఉద్యోగుల జన్మదిన వేడుకల కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా ఆహాజరై ప్రసంగించారు. మా కుటుంబం కూడా ఉపాధ్యాయ కుటుంబమేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మా నాన్నగారు ఆకుల అంజయ్య నిస్వార్ధంగా, మా తండ్రి ఆకుల అంజయ్య ప్రధానోపాధ్యాయుడిగా నిజాయితీగా ఉపాధ్యాయ భాద్యతలను చేపట్టారని అన్నారు. మీ మద్యలో రిటైర్డ్ ఉద్యోగిగా లేకపోవడం చాలా భాద కలిగిస్తుందన్నారు. ఆయన స్మారకంగా మీరు ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆర్థిక సహయాన్ని అందిస్తానన్నారు. ఆయన మాకు మా తండ్రి గారే స్పూర్తియని, ఆయన చూపెట్టిన మార్గంలో నడవడం వల్ల తామంతా ఈ స్థాయికి చేరుకున్నామన్నారు. మా ఎదుగుదలను చూసేందుకు ఆయన ఉండి ఉంటే ఎంతో సంతోషపడేవాడని భావోద్వేగానికి గురయ్యారు. మీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ నాపై ఉండాలని కోరారు. సమాజంలో ప్రతి ఒక్కరు గురువులను గౌరవించాలని ఆయన సూచించారు. డబ్బు కంటే ప్రేమ ఎంతో గొప్పది అన్నారు. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులకు సేవ చేస్తే వారి ఆశీర్వాదంతో భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆయన సూచించారు. అనంతరం విశ్రాంత ఉద్యోగులను ఆయన శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో చిట్టిబాబును శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు ప్రేమ్ కుమార్, మనోహర్ ప్రసాద్, సభ్యులు వీరేశం, భూమయ్య, రామ్ రెడ్డి, నర్సింలు, పండరయ్య, రాధాకృష్ణాగౌడ్, శేఖర్, దుర్గారాం, సత్తయ్య, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.