Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

హమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుకై చలో కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయండి * ములుగుమండల సిఐటియు నాయకులు ఎర్రోళ్ల మల్లేశం 

హమాలి కార్మికుల కొరకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30 న సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు హమాలి కార్మికులందరూ పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని ములుగు మండల సిఐటియు నాయకులు ఎర్రోళ్ల మల్లేశం పిలుపునిచ్చారు. ఒంటిమామిడి మార్కెట్ హమాలి కార్మికులతో కలిసి హమాలి వెల్ఫేర్ బోర్డు సాధనకై సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ధర్నాను జయప్రదం చేయడం కోసం కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీ కార్మికులకు పని ప్రదేశాల్లో అనేక సందర్భాలలో ప్రమాదాలు జరిగి కాళ్లు, చేతులు విరిగి పోవడం, ప్రాణాలు కూడా కోల్పోతున్న సందర్భాలు ఉంటున్నాయని, ఇలాంటి కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం హమాలి కార్మికులకు గుర్తింపు కార్డులు, ప్రమాద బీమా, ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాడ్యుటి, పెన్షన్ లాంటి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వ గోదాముల లోని హమాలి కార్మికులను నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, పని ప్రదేశాలలో కనీస మౌలిక వసతులు కల్పించాలని, కార్మికులందరికీ ఇండ్లు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

Related posts

రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి

Harish Hs

గొల్లగట్టును రాష్ట్ర పండుగగా గుర్తించాలి మన సాంస్కృతిక చరిత్రను కాపాడుకోవాలి. ఇది గొల్ల గట్టు (పెద్దగట్టు) జాతర చరిత్ర

TNR NEWS

రాళ్లకత్వలో ఘనంగా మల్లన్న జాతర – ముఖ్య అతిథులుగా హాజరైన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి మాజీ జెడ్పిటిసి కొలన్ బాల్రెడ్డి

TNR NEWS

వరిలో అగ్గి తెగులు నివారణ చర్యలు పాటించాలి

Harish Hs

ఇళ్ల స్థలాలు లేని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

Harish Hs

వాహనదారులు విధిగా హెల్మెట్, సీట్ బెల్టు ధరించాలి

Harish Hs