Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

దళిత ప్రధాన ఉపాధ్యాయులు రాములు పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి – ఉపాధ్యాయ, దళిత ప్రజా సంఘాల డిమాండ్

దళిత ప్రధానోపాధ్యాయులు రాములుపై దాడి చెసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని ఉపాధ్యాయ,దళిత ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. శనివారం నాడు లకిడకపూల్ లోని శాంతి చక్ర ఆడిటోరియం లో బహుజన టీచర్స్ అసోసియేషన్ (బిటిఎ)రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జిహెచ్ఎం రాములు పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్య దర్శి చైతన్య డిమాండ్ చేశారు. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఉపాధ్యాయ సంఘాలు అన్ని ముక్తకంఠంగా ఈ దాడిని యావత్ తెలంగాణ ఉపాధ్యాయ సమాజం పై జరిగిన దాడిగా అభి వర్ణించారు. భవిష్యత్తులో ఉపాధ్యాయులపై దాడులు జరగకుండా ఉండాలంటే వెంటనే ప్రభుత్వం స్పందించి దుండగులను శిక్షించాలని లేనిపక్షంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతాయని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులంతా ఆందోళనలకు దిగుతారని తెలియజేశారు. వెంటనే స్పందించి ఉపాధ్యాయులకు విద్యార్థులకు తగిన నిబంధనలు ఈ అయ్యప్ప మాలల విషయంలో కొన్ని నియమ నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. దళిత బహుజన ఫ్రంట్( డిబిఎఫ్) జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ దళితుడైన ప్రధానోపాధ్యాయులు రాములు పై పధకం ప్రకారం విహెచ్పి,భజరంగదళ్ దుండగుల దాడి చేయడం పిరికిపంద చర్య అన్నారు. మతోన్మాదుల దాడులను ఐక్యంగా ప్రతిఘటించాలన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పెంట అంజయ్య, దానయ్య,బిటిఎ ప్రధాన కార్యదర్శి మార్వాడి గంగ రాజు, గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకులు వెంకట్రాంరెడ్డి, మురళి కృష్ణ, మొహిద్దీన్,టిఎస్ టి యు అబ్దుల్లా, ఎస్.ఎల్ టిఎ నాయకులు గౌరీశంకర్, రాజకుమార్, యుటిఎ నాయకులు ఎండి షాఖిల్, దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన, పిఅర్ టియు నాయకులు మహేందర్ రెడ్డి, కృష్ణా రెడ్డి, యుటిఎఫ్ నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత

Harish Hs

మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

Harish Hs

దేశ భవిష్యత్తు యువత నడవడిక పై ఆధారపడి ఉంది

Harish Hs

కొమురవెళ్లి మల్లన్న సన్నిధిలో కార్తీక ఏకాదశి ఉత్సవం

TNR NEWS

వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు నిమ్మ పిచ్చమ్మ మరణం వ్యవసాయ కార్మిక ఉద్యమానికి తీరని లోటు….  తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు

TNR NEWS

ఉపాధ్యాయులకు ఘన సన్మానం

TNR NEWS