రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలు వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని మునగాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బుధవారం మునగాల మండల కేంద్రంలోని గణపవరం క్రాస్ వద్ద బుధవారం రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అతి వేగం అత్యంత ప్రమాదకరమన్నా రు.హెల్మెట్ లేకుండా బైక్ నడపరాదని సూచించారు. సీటు బెల్ట్ పెట్టుకొని కారు నడపాలన్నారు.ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయ రాదని చెప్పారు.పరిమితికి మించి లోడ్ వేయడం ప్రమాదం చట్ట రీత్యా నేరమని చెప్పారు. మైనర్లు డ్రైవింగ్ చేయరాదని సూచించారు.పార్కింగ్ లేని చోట వాహనా లు నిలపరాదని గుర్తుచేశారు.రాంగ్ రూట్ ప్రయాణం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. వాహనాలు జాగ్రత్తగా నడిపి క్షే మం గా ఇల్లు చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాహసీల్దారు వలిగొండ ఆంజనేయులు, ఎంపిడిఓ రమేష్ దీన్ దయాళ్,సిపిఎం నాయకులు దేవరం వెంకట రెడ్డి, కాంగ్రెసు నాయకులు గంధం సైదులు,పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.