మహబూబాబాద్ జిల్లా,తోరూర్ మండలంలోని చర్లపాలెం ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న జాటోత్ గణేష్ 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(SGF) ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయస్థాయి అండర్ 14 ఖో- ఖో పోటీలకు ఎంపికయ్యాడని ప్రధానోపాధ్యాయులు ఏం. బుచ్చయ్య మరియు ఫిజికల్ డైరెక్టర్ ఈ.మల్లయ్య తెలిపారు ఈనెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు మహారాష్ట్ర రాష్ట్రంలోని కొల్హాపూర్ లో జరిగే జాతీయస్థాయి ఖో-ఖో పోటీలలో గణేష్ పాల్గొంటాడని వారు తెలిపారు. ఈ సందర్భంగా జాటోత్ గణేష్ ను పాఠశాల ఉపాధ్యాయ బృందం, సీనియర్ ఇంచార్జ్ తనుజ , జయపాల్ రెడ్డి, కృష్ణ ,యాకూబ్ అలీ, ఉపేందర్ రెడ్డి,కరుణాకర్ రెడ్డి, స్వర్ణలత, కవిత, రాధా బాయ్ తదితరులు అభినందించారు.
previous post