ఏలూరు: సేంద్రీయ ఆహారం, ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరం వద్ద ఏర్పాటు చేసిన సేంద్రీయ ఉత్పత్తుల విక్రయశాలను జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తో కలిసి కలెక్టర్ వెట్రిసెల్వి సందర్శించారు.
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వారి సూచనల మేరకు ప్రతి సోమవారం సేంద్రీయ ఉత్పత్తులపై అవగాహన, ప్రోత్సహించేందుకు ఆయా ప్రకృతి వ్యవసాయం వారి సహకారంతో ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాటుచేస్తున్నారు. ఈ సందర్బంగా ఆయా సేంద్రీయ ఉత్పత్తుల విక్రయశాలలో ఉత్పత్తుల ప్రత్యకతను నిర్వహకులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కొన్ని ఉత్పత్తులను కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి కొనుగోలు చేశారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు సాగుచేసిన ఉత్పత్తులు ప్రజలకు మేలుచేస్తాయని కలెక్టర్ అన్నారు. అక్కడవున్న పలు సేంద్రీయ కూరగాయలు, తేనే, ఇతర ఉత్పత్తులను పరిశీలించి వాటిని ఏఏ ప్రాంతాల నుండి తీసుకువస్తున్నది ఆరా తీశారు.
కలెక్టర్ వెంట జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి షేక్ హబీబ్ భాషా, ఉధ్యానశాఖ డిడి ఎస్. రామ్మోహన్ తదితరులు ఉన్నారు.