డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత పాటుపడాలని మోతే ఎస్సై యాదవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మోతే పోలీస్ స్టేషన్ లో డివైఎఫ్ఐ మోతే మండల కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన” గంజాయి, డ్రగ్స్ నిర్మూలిద్దాం! యువతను కాపాడుకుందాం!!”అని పోస్టర్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడుతూ ఎంతో భవిష్యత్తు ఉన్న యువత మారక దవ్యాలకు, గంజాయికి అలవాటు పడి ఎంతోమంది తమ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న డివైఎఫ్ఐ సంఘాన్ని అభినందిస్తున్నామని అన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని, తాత్కాలిక ఆనందాల కోసం యువత వారి భవిష్యత్తును నాశనం చేసుకోదని సూచించారు. యువశక్తి దేశానికి ఎంతో అవసరమని దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందన్నారు. జీవితం చాలా విలువైనదని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం గా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తో డివైఎఫ్ఐ భాగస్వామ్యం కావాలని కోరారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్న, కొనుగోలు చేస్తున్న పోలీసు కు సమాచారం ఇవ్వాలని కోరారు. డ్రగ్స్, గంజాయి రహిత సమాజం కోసం డివైఎఫ్ఐ కృషి చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మాజీ రాష్ట్ర నాయకులు మట్టిపల్లి సైదులు, డివైఎఫ్ఐ మోతే మండల అధ్యక్షులు వెలుగు మధు, మాజీ డివైఎఫ్ఐ నాయకులు కిన్నెర పోతయ్య, దోస పాటి శ్రీను, ఎడ్ల సైదులు తదితరులు పాల్గొన్నారు.
next post