యోగ మనిషి జీవనంలో భాగం కావాలని అది అనేక మార్పులకు నాంది అవుతుందని సీనియర్ సివిల్ జడ్జి కె సురేష్ అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగ డే సందర్భంగా కోదాడ కోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.నేటి పోటీ ప్రపంచంలో మానసిక ఒత్తిడి తగ్గించి,శారీరక,మానసిక ప్రశాంతత ను పొందాలంటే యోగ ఒక చక్కటి మార్గమని ఆయన అన్నారు. యోగ మరియు ఆసనాల ద్వారా శరీరంలో ప్రతి అవయవం కదిలి శరీరం, మనస్సు ను శుద్ధి అవుతుందని అందరూ ముఖ్యంగా న్యాయవాదులు తమ వృత్తి ఒత్తిడి లో యోగ వారికి మంచి ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి కె.భవ్య, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ch. సత్యనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ch. లక్ష్మీనారాయణ రెడ్డి,కార్యదర్శి రామిశెట్టి రామకృష్ణ, ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య, న్యాయవాదులు సిలివేరు వెంకటేశ్వర్లు,గట్ల నర్సింహారావు, యడ్లపల్లి వెంకటేశ్వరరావు,తమ్మినేని హనుమంత రావు, యశ్వంత్,రహీం,హుస్సేన్,కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
