పెద్దపల్లి పట్టణంలోని స్థానిక శ్రీ అరబిందో కాకతీయ సెకండరీ పాఠశాల పెద్దపల్లి లో ఇటీవల వివిధ తరగతుల విద్యార్థులకు నిర్వహించినటువంటి ఇండియన్ ఒలంపియాడ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రశంస పత్రాలు, మెడల్స్ తో సత్కరించడం జరిగింది. ఈ పోటీ పరీక్షలలో ప్రతిభ కనబరిచి మెరిట్ సాధించిన విద్యార్థిని విద్యార్థులను సెకండ్ లెవెల్ కు సెలెక్ట్ అయినందుకు గాను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. పాఠశాల స్థాయి నుండి వివిధ పోటీ పరీక్షలకు అర్హత సాధించేటట్లుగా మా శ్రీ అరబిందో కాకతీయ పాఠశాల విద్యార్థిని విద్యార్థులను తీర్చిదిద్దడం మా పాఠశాల ప్రత్యేకత అని తెలిపారు.సెకండ్ లెవెల్ కు అర్హత సాధించిన రూపాలి 3వ తరగతి,శశి కుమార్ 3వ తరగతి, సంజు శ్రీ 8వ తరగతి, నాగశ్రీ సన్నిద్ 9వ తరగతి, హాసిని 10 వ తరగతి విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ ఆర్.వి. రమణారావు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఇందుకు సహకరించినటువంటి పాఠశాల అధ్యాపక బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులతో పాటు డైరెక్టర్ మణి, ఇన్ చార్జ్ ఇమ్రాన సుల్తానా,ఆధ్యాపక బృందం పాల్గొన్నారు.