ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అసోసియేషన్ మెట్ పల్లి అధ్యక్షుడిగా రెండవసారి ఎన్నికైన గంగాసాగర్ ను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. పేద రోగులకు సేవాభావంతో వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని ఈ సందర్భంగా బీసీ నాయకులు ఆయనను కోరారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మెన శంకర్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నల్ల వెంకటేశ్వర్లు, నాయకులు నర్సింగరావు, జాప నారాయణ, సదానందం, ప్రతాప్, జావీద్, గట్టయ్య, సత్యనారాయణ రాజు, చిన్నయ్య, బండి నాగరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
previous post