Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

, చేవెళ్ల    మండల కేంద్రంతో పాటు, మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఎగురవేసిన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఆదివారం మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల ముందు, పోలీసు స్టేషన్, రాజకీయ పార్టీల కార్యాలయాలు, ఆసుపత్రులు, యువజన సంఘాలు, అంగన్వాడీ కేంద్రాలు తదితర కార్యాలయాలపై జాతీయ పతకాన్ని ఎగురవేసి జనగణమన గీతాన్ని ఆలపించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఆర్డీవో కార్యాలయంపై ఆర్డీవో చంద్రకళ, ఏసీపీ కార్యాలయంపై ఏసీపీ కిషన్, తహశీల్దార్ కార్యాలయంపై తహశీల్దార్ కృష్ణయ్య, మండల ప్రజా పరిషత్ కార్యాలయంపై ఎంపీడీవో హిమబిందు, ముడిమ్యాల పీఎసీఎస్ కార్యాలయం ముందు చైర్మన్ గోనే ప్రతాప్ రెడ్డి, మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు చేవెళ్ల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సున్నపు ప్రవీణ్, సర్పంచుల కాలం ముగిసినందున మండలంలోని ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల ముందు ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు జాతీయ జెండాను ఎగురవేశారు. మండల కేంద్రంతో పాటు, మండల పరిధిలోని గ్రామ గ్రామాన గణతంత్ర దినోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి. పంచాయతీ ఎన్నికలు సమీపస్తుండటంతో ఆశవాహులు, వారి అనుచర వర్గాలు అన్ని గ్రామాలలోని జాతీయ పతాక ఆవిష్కరణలో ఉల్లాసంగా పాల్గొన్నారు. అలాగే గ్రామ గ్రామాన ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మహానీయుల అడుగుజాడల్లో నడిచినప్పుడే వారికి నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందన్నారు. ప్రతిఒక్కరూ స్మరించుకోవాలన్నారు.

Related posts

క్రెడాస్ సేవలు వినియోగించుకోవాలి 

TNR NEWS

*కార్తీక పూజల్లో పాల్గొన్న మాజీమంత్రి జగదీష్ రెడ్డి దంపతులు..*

Harish Hs

కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు

Harish Hs

ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి లో కొత్త రికార్డు సృష్టించిందని జుక్కల్ ఎమ్మెల్యే తోట

TNR NEWS

ఉపాధి’ హామీ పథకంలో అవకతవకలు..!

TNR NEWS

ఆశ వర్కర్లకు పెండింగ్ జీతాలు చెల్లించాలి.  సర్వేలు ఆపేస్తాం  డిఎంహెచ్వో కార్యాలయం ముందు సీఐటీయూ ధర్నా.

TNR NEWS