Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రజావాణికి 93 దరఖాస్తులు…  ఇంటర్ పరీక్షలకు ఆన్ని ఏర్పాట్లు… జిల్లా కలేక్టర్ తేజస్  సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలి….

సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 93 దరఖాస్తులు వచ్చాయని సంబంధిత శాఖ అధికారులు దరఖాస్తులు వెంటనే పరిష్కరించే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు అని ఏర్పాట్లు చేయాలని సమంత శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు పోలీస్ శాఖ వారు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు నిర్వహించాలని సి ఆర్ పి సి సెక్షన్ ప్రకారం 144 సెక్షన్ అమలుపరచాలని జిరాక్స్ సెంటర్ లన్ని బంద్ చేయాలని అధికారులు తమ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆర్టీసీ వారు పరీక్షల సమయంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు 03 -02-2025 నుండి 22 -02-2025 వరకు ఇంటర్మీడియట్ థిరి పరీక్షలు05-03-2025 నండి 25-03-2025 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు మరియు 2:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, తీరి పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, కావున పరీక్ష సమయానికి అన్ని రోడ్లలో బస్సులను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్స్ నందు చదువుతున్న విద్యార్థుల కొరకు వారు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునే విధంగా సంక్షేమ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు ప్రాథమిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యుత్ శాఖ వారు నిరంతరంగా విద్యుత్ సరఫరా ఉండే విధంగా చూడాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు పరీక్ష కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పరీక్ష కేంద్రాల వద్ద త్రాగునీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న నాలుగు సంక్షేమ పథకాలను అధికారులు అర్హులైన వారికి అందేలా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి అందేలా చూడాలని కలెక్టర్ తెలిపారు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ పి రాంబాబు, డి ఆర్ డి ఓ వివి అప్పారావు, సిపిఓ ఎల్ కిషన్, ఎల్ డి ఎం బాపూజీ, వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, డిటిడివో శంకర్, డిఇఓ అశోక్, ఎస్సీ అభివృద్ధి అధికారి లత ,బిసి అభివృద్ధి అధికారి అనసూయ, మైనార్టీ వెల్ఫేర్ అధికారి జగదీశ్ రెడ్డి, డియమ్ మార్కెటింగ్ శర్మ జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

TNR NEWS

25 న బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం 

TNR NEWS

సూక్ష్మ కళాకారుడి అద్భుత ప్రతిభ

TNR NEWS

ఎండలు పెరుగుతాయ్జా గ్రత్తగా ఉండాలి

TNR NEWS

*మాలల సింహాగర్జనను విజయవంతం చేయాలి* ● సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పలు గ్రామాల్లో సింహగర్జన వాల్ పోస్టల్ ఆవిష్కరణ

TNR NEWS

వి. ఎన్. స్ఫూర్తితో పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి.  సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి

TNR NEWS