Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత

రోడ్డు భద్రతా మసోత్సవాల్లో భాగంగా మునగాల మండల కేంద్రంలోని ప్రజ్ఞ పాఠశాలలో విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్, రాష్ డ్రైవింగ్, త్రీబుల్ రైడింగ్, హెల్మెట్ ఉపయోగం పై మంగళవారం కోదాడ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ షేక్ జిలాని విద్యార్థులకు అవగాహనా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా,రోడ్డు నియమాలు నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని అన్నారు. ప్రమాదాలు ఎక్కువగా అతివేగంగా వాహనాలు నడుపుతూ అనేక ప్రమాదాలకు గురి అవుతున్నారని,వాహనాలు నడిపే సమయంలో తమ ప్రాణాలనే కాకుండా తమపై ఆధారపడి కుటుంబ సభ్యులను దృష్టిలో వుంచుకొని వాహనాలను నడుపుతూ సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవాలని అన్నారు. వాహనదారులు వాహన వేగం నిర్ణీత వేగం తగ్గించి నడపడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయని అన్నారు. డ్రంకెన్‌డ్రైవ్‌, అతివేగం, మొబైల్‌ ఉపయోగిస్తూ డ్రైవింగ్‌, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించుట హెల్మెట్ లేకుండా ప్రయాణించడం లాంటి సమయంలో రోడ్డు ప్రమాదం సంభవిస్తే అధిక ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని జాగ్రత్తలు పాటిస్తూ, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యాన్ని చేరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కాసాని కృష్ణమూర్తి,ఎంవిఐ సిబ్బంది నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణాన్ని ప్రారంభించిన తెలంగాణ పర్యాటకశాఖ…..

Harish Hs

కలాం దేశానికి  చేసిన సేవలు చిరస్మరణీయం

TNR NEWS

కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా ఏపూరి తిరపమ్మ సుధీర్..

TNR NEWS

అమృత రామానుజరావు ట్రస్ట్ సేవలు అభినందనీయం : డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి

Harish Hs

సుధా బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Harish Hs

తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన ట్రాఫిక్ సిఐ

TNR NEWS