శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డెన్ సెర్చ్ చేపడుతున్నట్లు మునగాల సర్కిల్ సీఐ రామకృష్ణారెడ్డి అన్నారు.మునగాల మండల నారాయణగూడెం గ్రామంలో ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు శనివారం రాత్రి 8 గంటల సమయంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించి,సరైన పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలు,రెండు ఆటోలు, ఒక ట్రాక్టర్ సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ వాహనదారులు తమ వాహనాలకు సరైన పత్రాలను కలిగి ఉండాలన్నారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.ఈ కట్టడి ముట్టడి లో మునగాల, నడిగూడెం ఎస్సైలు ప్రవీణ్ కుమార్, అజయ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

previous post