Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి

జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను సాధిద్దామని టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావులు అన్నారు. గురువారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని గాంధీ పార్క్ లో ఉన్న విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ పాత్ర కీలకమన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో నడవాలని అన్నారు. సత్యం, అహింస, ధర్మం అనే మార్గంలోనే చివరివరకు నడిచారని అన్నారు. నేటి యువత వారి ని ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్, సుందరి వెంకటేశ్వర్లు, డేగ శ్రీధర్, షమ్మీ,బాగ్దాద్, భాజాన్, ధావల్, గుండె పంగు రమేష్,ముస్తఫా, బాబా,సైదిబాబు, రహీం, ఖాజా గౌడ్, గంధం పాండు, శోభన్, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు……..

Related posts

ప్రజా పాలనా ప్రజా విజయోస్తవాలు. జిల్లా అటవీ శాఖాధికారి కార్యాలయము

TNR NEWS

మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

Harish Hs

విత్తనాల కొనుగోలులో.. అన్నదాతలు జర జాగ్రత్త

Harish Hs

రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దు- ఎస్పీ నరసింహ

TNR NEWS

ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

TNR NEWS

వేంపేట్ పాఠశాలలో ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవము

TNR NEWS