చేవెళ్ల మండల పరిధిలోని కౌకుంట్ల గ్రామంలో మూడు రోజుల పాటు ప్రత్యేక పూజల అనంతరం సోమవారం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. వేద మంత్రాల నడుమ ప్రతిష్ఠాపనా కార్యక్రమాలను ఆలయ ఉత్సవ కమిటీ దిగ్విజయంగా నిర్వహించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గ్రామానికి వచ్చిన వారికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో నూతన ధ్వజస్తంభం ప్రతిష్టాపన చేయడం శుభసూచికమని అన్నారు. ప్రతి ఒక్కరూ దైవం పట్ల భక్తిశ్రద్ధలతో ఉండాలని కోరారు. గ్రామంలోని రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో వుండాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాయత్రి గోపాలకృష్ణ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెద్దొళ్ల ప్రభాకర్, బీఆర్ఎస్ నాయకులు విఘ్నేష్ గౌడ్, యువ నాయకులు హరీష్, గ్రామ పెద్దలు మల్ రెడ్డి, నాగార్జున రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.
