కాకినాడ : ఓటుకు సార్ధకత చేకూరేవిధంగా కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి పట్టభద్రుల భవిష్యత్ కు బంగారు బాట వేసే సమర్ధత, సామర్ధ్యం కలిగిన రాజశేఖరంను శాసన మండలికి పంపించాల్సిన ఆవశ్యకత నెలకొందని తూరంగి మాజీ ఎంపీటిసి పితాని వెంకట రాము పట్టభద్రుల ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల ఫిబ్రవరి 27న జరుగనున్న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం కూటమి అభ్యర్దిగా సూదీర్ఘ కాలం ప్రజలతో మమేకం అయ్యి, ప్రజా సమస్యల పై సంపూర్ణ అవగాహన కలిగిన అజాత శత్రువు, రాజకీయ స్టితప్రజ్ణుడు పేరాబత్తుల రాజశేఖరంకు కేటాయించిన ఎన్నికల బ్యాలెట్ పత్రంలో మొదటి ప్రాధాన్యత కల్పించి ఆయన పేరుకు ఎదురుగా ఉన్న బాక్స్ లో కేవలం ఒకటి అంకె మాత్రమే వేసి అఖండ మైన మెజారిటీతో శాసన మండలికి పంపించాలని కోరుతున్నారు. అత్యదిక మేధావులు, ఉన్నత విద్యావంతులు, విద్యా వేత్తలు ఓటర్లుగా ఉన్న ఈ ఎన్నికల్లో పట్టభద్రుల విధి విధానాలు, ఉపాధి, ఉద్యోగాలు అంశాల పై పోరాడి సాధించే సత్తా కల్గిన నాయకుడు పేరా బత్తుల రాజశేఖరం మాత్రమే అన్న విషయాన్ని పట్ట బద్రులు విజ్ఞతతో ఆలోచించి పేరాబత్తుల రాజశేఖరంకు పట్టం కట్టడడం ఎంత అయినా సమూచితంగా ఉంటుందని పితాని వెంకట రాము కోరుతున్నారు.
