Tnrnews.in
తెలంగాణ

నేడు మునగాల లో విజ్ఞానోత్సవం

నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా *”మునగాల లో విజ్ఞానోత్సవం”* నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి పి. వెంకటేశ్వర్లు తెలిపారు.

దీనికి సంబంధించిన గోడ పత్రికను *డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైన్స్ ఫోరం- తెలంగాణ వ్యవస్థాపకులు గోళ్ళమూడి రమేష్ బాబుతో కలిసి* ఆయన సోమవారం మండల కేంద్రంలో ఆవిష్కరించారు.మంగళవారం *గంధం నర్సయ్య విజ్ఞాన ప్రాంగణం,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో* నిర్వహించే 

ఈ సైన్స్ వేడుకలలో మండలంలోని *ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులు* అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు.గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లోని సృజాత్మక శక్తిని వెలికి తీసే విధంగా నిర్వహిస్తున్న *సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలతో పాటు, పర్యావరణ పరిరక్షణ తో గీసిన డ్రాయింగ్స్ ప్రదర్శన మరియు సైన్స్ సాంస్కృతిక ప్రదర్శనలు, కళారూపాలు, విజ్ఞానాత్మక అంశాల డాన్స్ లు* తదితర అంశాల్లో పాల్గొనే విద్యార్థులను వెంట తీసుకొని ప్రధానోపాధ్యాయులు,సైన్స్ ఉపాధ్యాయులు రావాలని ఆయన కోరారు.ఈ వేడుకల్లో పాల్గొన్న *చిన్నారులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు కూడా అందిస్తున్నట్టు కన్వీనర్ శ్రీరామ్ శ్రీనివాస్ రావు* తెలిపారు.పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో గోవర్ధన్, జ్యోతి, అంజన్ రెడ్డి, విద్యా భవాని, నాగమణి, సాజిదా బేగం తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

క్వాలిటీ చికెన్ ను అందించి ప్రజల ఆదరణ పొందాలి..

Harish Hs

మాజీ ఉప ముఖ్యమంత్రి కె ఈ కృష్ణమూర్తి కలిసిన మాజీ మంత్రివర్యులు

TNR NEWS

విద్యార్థులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలి

Harish Hs

బీర్పూర్ లో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

TNR NEWS

అమరవీరుల ఆశయ సాధన కోసం ఉద్యమిద్దాం – పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్

TNR NEWS

జయశంకర్‌ ఆశయసాధనకు కృషి చేయాలి

Harish Hs