ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలికల సక్సెస్ పాఠశాలలో మండలంలో అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కార్యక్రమం ఐదు రోజులపాటు శిక్షణ అందిస్తున్నట్లు మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని విద్యార్థులకు సులభతరంగా విద్యను బోధించేలా ఉపాధ్యాయులకు శిక్షణ. ఇస్తూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంపొందించేలా మూతపడిన పాఠశాలలను రీ ఓపెన్ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు రానున్న రోజుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు .ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి . అన్ని పాఠశాలల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎమ్మార్సీ సిబ్బంది పరశురాములు రాజేందర్ పాల్గొన్నారు.