పిఠాపురం : గత 25 సంవత్సరాలు నుండి క్రమం తప్పకుండా మహాశివరాత్రి సందర్భంగా సహృదయ మిత్రమండలి ఆధ్వర్యంలో స్థానిక పాత ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా ఉచిత ఆరోగ్య ఎంటీ డ్రగ్, మధ్యము మాదక ద్రవ్యాలు మీద అవేర్నెస్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ సిఐ జి.శ్రీనివాస్ వచ్చి స్ట్రాల్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సంధర్భంగా సిఐ జి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న సమాజంలో ఇలాంటి క్యాంపులు యువతకి సమాజానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహృదయ మిత్రమండలి అధ్యక్షులు తోట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సి.హెచ్.సతీష్, ఉప కార్యదర్శి పి.వేణు, గౌరవ అధ్యక్షులు కే.అప్పారావు, డాక్టర్ ఎన్.సూర్యనారాయణ, మిత్ర మండలి సభ్యులు సాల్మన్ రాజు, ప్రకాష్ రావు, గోవింద్, తాతారావు, సుబ్రహ్మణ్యం, కుమార్, శ్రీను, కరణం విశ్వనాధం, తోట నాగేంద్ర ప్రసాద్, ప్రత్యూష్ మొదలైన వారు హాజరై కార్యక్రమాన్ని నిర్వహించారు.

previous post