Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

బహుజనుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి కాన్షీరాం

  • బిఎస్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖండవల్లి లోవరాజు

పిఠాపురం : బహుజనుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి కాన్షీరాం అని బహుజన సమాజ్‌ పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి, పిఠాపురం నియోజకవర్గం ఇంఛార్జ్‌ ఖండవల్లి లోవరాజు కొనియాడారు. శనివారం ఆయన 91వ జయంతి సంధర్భంగా పట్టణంలోని పక్షులమర్రిచెట్టు వద్ద ఎస్సీపేటలో డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం వద్ద కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ వేసిన బాటలో నడుసూ, ప్రతీ ఎస్పీ, ఎస్టీ, మైనార్టీ, వెనకపడిన కులాలు అందరికి న్యాయం చెయ్యాలని తన జీవితాన్ని సైతం లెక్కచేయ్యకుండా అలుపెరగని పోరాటం చేసిన వ్యక్తి అని అన్నారు. అదే విధంగా బహుజనుల కోసం ప్రత్యేకంగా ఒక రాజకీయ పార్టీ ఉండాలనే ఉద్దేశ్యంతో బహుజన సమాజ్‌ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. ఆయన చేసిన సేవలను మనం ఎప్పటికి మర్చిపోకూడదని, బహుజనుల రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీకోలు శ్రీను, సీకోలు చంటి, ముక్కుడుపల్లి సూర్యచంద్ర, శివకోటి అప్పారావు, వీర్రాజు, యేసు, లోవరాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వ ఉద్యోగుల భార్యలకే కుట్టు మిషన్ల పంపిణీనా..!?

Dr Suneelkumar Yandra

చిల్డ్రన్ మరియు యూత్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్

Dr Suneelkumar Yandra

ఏపీ ప్రజలకు సూపర్ న్యూస్.. కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్‌డేట్.. ఎప్పటి నుంచి అంటే?

Dr Suneelkumar Yandra

రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించిన పార్టీ జనసేన

Dr Suneelkumar Yandra

శివరాత్రికి ఏర్పాట్లు సర్వం సిద్ధం – కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన శ్రీనివాస్‌

Dr Suneelkumar Yandra

పోలీసుల సంక్షేమానికి ఏడాదికి రూ. 20 కోట్లు చొప్పున ఇస్తాం*

TNR NEWS