November 8, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి ఘనంగా నివాళులు

వీర తెలంగాణ సాయుద రైతాంగా పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి సందర్భంగా మునగాల మండల కేంద్రంలో సుందరయ్య స్మారక భవనము నందు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బచ్చలకూర స్వరాజ్యం, చందా చంద్రయ్య,ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి విప్లవ జోహార్లు ఆర్పించారు.

 బుధవారం మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి సభ చందా చంద్రయ్య అధ్యక్షతన జరిగినది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటి సభ్యుల బచ్చలకూర స్వరాజ్యం మాట్లాడుతూ కామ్రేడ్ మల్లు స్వరాజ్యం నిజం రాజు రాచరిక పాలన, దొరల భూస్వాముల వెట్టి చాకిరి వ్యతిరేకంగా మట్టి మనసుల గుండె చప్పుడై సమ సమాజం కోసం సాయుద పోరు సమరమై దొరల పెత్తందారు విధానాన్ని నేలా కూల్చిన మహా వీర వనిత మల్లు స్వరాజ్యం అని అన్నారు. నేటి యువతకు ఆమె జీవితం ఆదర్శప్రాయం నేటి పాలకుల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా యువత పనిచేయాల్సిన అవసరం ఉన్నది అని అన్నారు.

 ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు బి కృష్ణారెడ్డి, ఎస్ పిచ్చయ్య, డి ఉపేందర్, జి మల్లారెడ్డి, ఎన్ సైదులు, బి సుందరయ్య, ఎస్ నాగరాజు, కె ఈదయ్య, తదితరులు పాల్గొన్నారు

Related posts

మంత్రి పిఎ శ్రీధర్‌ రిసెప్షన్‌ కు హాజరైన మంత్రి దామోదర్‌ 

TNR NEWS

మదర్ థెరిసా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

Harish Hs

సన్రైజ్ వెస్ట్ జోన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా యోగా దినోత్సవం

Harish Hs

అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్తం

TNR NEWS

ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు 

Harish Hs

పెద్దమ్మ, డబల్ బెడ్ రూమ్ కాలనీలలో మౌలిక సమస్యలు పరిష్కరించాలి.   సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు

TNR NEWS