మునగాల మండల పరిధిలోని జాతీయ రహదారిపై ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన సంఘటన సోమవారం మండల పరిధిలోని ఆకుపాముల గ్రామ శివారులో చోటుచేసుకుంది ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం, మండల పరిధిలోని బరా కత్ గూడెం గ్రామానికి చెందిన పాలపాటి వీరబాబు అనే ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ ఫై వరి ధాన్యాన్ని బరాకత్ గూడెం గ్రామంలో దిగుమతి చేసి తిరిగి అదే ట్రాక్టర్ తో తాను నివాసం ఉంటున్న ఖమ్మం జిల్లా వెంకటగిరి బయలుదేరి వెళుతూ మండల పరిధిలోని ఆకుపాముల గ్రామ శివారులోని గంగమ్మ దేవస్థానం వద్దకు వెళ్ళగానే అదుపు తప్పిన ట్రాక్టర్ 65వ నెంబర్ జాతీయ రహదారిపై డివైడర్ను ఢీ కొట్టి పల్టీ కొట్టిన ఘటనలో, ట్రాక్టర్ డ్రైవర్ వీరబాబు అక్కడికక్కడే మృతి చెందాడు, ఈ ఘటనలో మరొక వ్యక్తికి గాయాలు కాగా మృతుడిని మరియు గాయాలైన వ్యక్తిని 108 వాహనంలో కోదాడ వైద్యశాలకు తరలించారు,

previous post
next post