తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు నినాదంతో తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో ఈనెల 31 న హైదరాబాద్ లోని జల విహార్ లో నిర్వహిస్తున్న 25 వసంతాల రజతోత్సవ పోస్టర్లను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం జర్నలిస్టులు పెడికిలి బిగించి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. రాష్ట్ర సాధనలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ నాయకత్వంలో రజతోత్సవ సంబరాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు బేత రమేష్, ప్రధాన కార్యదర్శి ఎల్. రాజు, యూనియన్ నాయకులు ఏం .సంతోష్, ఆర్ సుభాష్, నేరడిగొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాజుల దేవేందర్, నాయకులు కొప్పుల ప్రమోద్, గాజుల శ్రీకాంత్, సతీష్, నవీన్, శోభన్ తదితరులు పాల్గొన్నారు.