దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల గుండెల్లో నేటికీ చిరస్థాయిగా నిలిచిపోయారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని బాబు అన్నారు. మంగళవారం వైయస్సార్ జయంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని ప్రధాన రహదారిపై ఉన్న ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైయస్సార్ పాలనలో పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించారని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చందు నాగేశ్వరరావు, నెమ్మాది ప్రకాష్ బాబు, దేవమణి, రావెళ్ల కృష్ణారావు, గంధం పాండు తదితరులు పాల్గొన్నారు……..
