సీఎం సహాయనిధి పేదలకు ఒక వరం లాంటిదని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోదాడ నియోజకవర్గంగా పలు మండలాలకు చెందిన 260 మంది లబ్ధిదారులకు రూ. 85 లక్షల 36 వేల 500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు..పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాల బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించటం ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలుస్తున్నదన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

previous post
next post