యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపురం మండలం వెంకంబావి తండాలో భజరంగ్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గణనాధుని చివరి రోజు మాజీ గ్రామ సర్పంచ్ పానుగోతు పాండురంగ నాయక్ ఆధ్వర్యంలో గణనాథునికి పూజలు నిర్వహించి లడ్డు పాట వేశారు.
ఈ సందర్భంగా పిటీఎన్ సేవ ట్రస్ట్ చైర్మన్ పానుగోతు తరుణ్ నాయక్ ఆధ్వర్యంలో గణనాథుని శోభయాత్రకి వచ్చినటువంటి అతిథులకు శాలువతో సత్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంకంబావితండ గ్రామ యువకులు ముఖ్యంగా మద్యానికి డ్రగ్స్ కు దూరంగా ఉండాలని యువకులకు సూచించారు.
భజరంగ్ యూత్ అసోసియేషన్ సభ్యులు గ్రామ అభివృద్ధి కొరకు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని వారు సూచించారు
ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.