కేంద్రం నుండి యూరియా తెప్పించడంలో బిజెపి కేంద్ర మంత్రులు ,ఎంపీలు పూర్తిగా విఫలం చెందారని తెలంగాణ రైతు సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోల్లు ప్రసాద్ అన్నారు. మంగళవారం స్థానిక సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయములొ సహాయ వ్యవసాయ సంచాలకులు ప్రశాంతి ని తమ్మర గ్రామానికి చెందిన 20 మంది రైతులు కలవడం జరిగింది. ఈ సందర్భంగా బొల్లు ప్రసాద్ మాట్లాడుతూ పొలాలు పొట్టకు వస్తున్న సమయంలో యూరియా కొరత ఏర్పడటంతో పంట దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోతారని అలా జరగకుండా రైతులకు ఇబ్బంది లేకుండా యూరియాని అందించాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది బిజెపి ఎంపీలు ఉండి కూడా రైతు కష్టాలను తీర్చడంలో పూర్తిగా విఫలం చెందారని అన్నారు. ఇకనైనా రైతులు ఇబ్బంది పడకుండా తక్షణమే యూరియాను అందించాలని లేనిపక్షంలో రెండు మూడు రోజులలో రైతులతో భారీగా ధర్నాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రచార మాధ్యమాలలో యూరియా కొరత లేదని చెప్తున్నా వ్యవసాయ శాఖ వారు మాత్రం రైతులకు యూరియా అందించడంలో విఫలం చెందారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాతంగి ప్రసాద్,నరేష్,గోపాల్, చంటి, ఏసుపాదం,జయ సూర్య, కనగాల పూర్ణయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

previous post
next post