మరువ తరమా’ సినిమా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ తో వచ్చిన సినిమా శుక్రవారం విడుదలైంది. రిషి, సింధు, అన్వీల మధ్య నడిచే ఈ కథలో ప్రేమ, వియోగం, తల్లి పాత్ర కీలకమైనవి. దర్శకుడు చైతన్య వర్మ సహజత్వంతో కథను నడిపించడానికి ప్రయత్నించారు. ఫస్టాఫ్ నెమ్మదిగా సాగినా, సెకండాఫ్‌లో భావోద్వేగ సన్నివేశాలు, రోహిణి పాత్ర చెప్పిన జీవిత సత్యాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. నటీనటుల పనితీరు, ముఖ్యంగా రోహిణి, అవంతికల నటన, విజయ్ బుల్గానిన్, హరీష్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు బలాన్నిచ్చాయి.
