Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణవిద్య

విద్యార్థులు చట్టాలను తెలుసుకోవాలి

విద్యార్థి దశలోనే విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకొని సమాజంలో నేర ప్రవుత్తిని తగ్గించేందుకు కృషి చేయాలని కోదాడ సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కే. సురేష్ అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా బుధవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాల కార్మిక చట్టం, విద్యా హక్కు చట్టం, యితర చట్టాల గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చట్టాలు, న్యాయ సూత్రాల తెలుసుకొని భవిష్యత్తు లో మంచి పౌరులుగా తయారుకావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు దుర్వసనాల బారిన పడకుండా చదువు పై దృష్టి పెట్టి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గట్ల నరసింహారావు, ప్రధాన కార్యదర్శి చింతకుంట్ల రామిరెడ్డి, ఎం ఈ వో సలీం షరీఫ్, న్యాయవాదులు మంద వెంకటేశ్వర్లు, సెగ్గెం వెంకటాచలం, దొడ్డ శ్రీధర్, తాటి మురళీ, హేమలత, బండి వీరభద్రమ్, ఆవుల మల్లికార్జున రావు, సుల్తాన్ నాగరాజు, పాఠశాల ఉపాధ్యాయులు మార్కండేయ, బడుగుల సైదులు తదితరులు పాల్గొన్నారు.

 

Related posts

కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీకి వన్నె తేవాలి  పార్టీలో పని చేసే కార్యకర్తలను గుర్తిస్తాం   మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి తోనే కోదాడ అభివృద్ధి కోదాడ మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు ఆధ్వర్యంలో ఘన సన్మానం

TNR NEWS

సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి  ఎస్ఎఫ్ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆముదాల రంజిత్ రెడ్డి, దాసరి ప్రశాంత్  ఎస్ఎఫ్ఐ, సమగ్ర శిక్షణ ఉద్యోగులు తో సిద్దిపేట కలెక్టరేట్ ఎదురుగా ధర్నా

TNR NEWS

విమాన ప్రమాద ఘటన పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎర్నేని వెంకటరత్నం బాబు

Harish Hs

పోలీసు ప్రజా భరోసా నూతన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

TNR NEWS

క్రీడలతో మానసిక ఉల్లాసం

Harish Hs

తెలంగాణాలో సూర్యుడు భగ.. భగ..

TNR NEWS