భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా బాలల దినోత్సవం ఆనవాయితీ దానిలో భాగంగా శనివారం చిలుకూరు మండల కేంద్రంలోని స్థానిక సాయి గ్రామర్ పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ స్వపరిపాలన దినోత్సవం నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గవిని ఆంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి ఎం గురవయ్య హాజరైనట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి గురవయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు ఉపాధ్యాయ వేషధారణలో పాఠ్యాలు బోధించే తీరును ప్రశంసించారు. నైతిక విలువలతో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు.అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినీలు జి. ఉమా, దీప్తి, నిర్మల, బి. ఉమా, కె.వినోద తదితరులు పాల్గొన్నారు.