గీతా కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గీతా కార్మికులకు కాటమయ్య రక్షక కవచ్ కిట్లను పంపిణీ చేశారు. తాటి చెట్లు ఎత్తు తక్కువగా ఉండేలా కూడా శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయని వివరించారు. 50% తాటి, ఈత చెట్లను కాలువలు, రోడ్లు, చెరువు గట్లపైన నాటాలని పేర్కొన్నారు. ఈ రక్షక కిట్లను గీతా కార్మికులు జాగ్రత్తగా వాడుకోవాలన్నారు. త్వరలోనే గీతా కార్మికుల అభివృద్ధికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.