గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం దళితులను అన్ని విధాలా మోసం చేసిందని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా ఎస్ సి డిపార్ట్మెంట్ చైర్మన్ కొమ్ము విజయ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే దళితులకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని,శుక్రవారం కొండపాక లోని తన నివాసంలో జిల్లా, ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ సి డిపార్ట్మెంట్ స్టేట్ చైర్మన్ ప్రీతం ఆదేశాల మేరకు సిద్దిపేట నియోజక వర్గం నుంచి పలువురికి పార్టీ బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ ఎస్ సి డిపార్ట్మెంట్ జిల్లా కన్వీనర్ లు, ముత్యాల యాదగిరి, ఎర్ర స్వప్న, అసెంబ్లీ కన్వీనర్ గా బొడ్డు బాలరాజు, జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ గా చేగురి యాదగిరి లను నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పై నమ్మకం తో మాకు బాధ్యతలు అప్పగించిన ప్రీతం కి, జిల్లా అధ్యక్షలు విజయ్ కుమార్ లకు మరియు నియోజక వర్గ ఇంచార్జ్ పూజలు హారికృష్ణ,మరియు సీనియర్ నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.