Tnrnews.in
తెలంగాణ

జ్యోతిరావు పూలే ఆశయాలు సాధించాలి

 

సామాజిక వేత్త మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను నేటి యువత సాధించాలని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. గురువారం పూలే వర్ధంతి సందర్భంగా పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో పూలే విగ్రహ కమిటీ అధ్యక్షులు పాలూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ పారా సీతయ్యలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో కుల వివక్ష అంతమొందించాలంటే విద్యే ఏకైక మార్గమని నమ్మి బడుగు బలహీన వర్గాల విద్య కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు పూలే అని వారి సేవలను కొనియాడారు. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకొని వారు చూపిన బాటలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బాల్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, గుండెల సూర్యనారాయణ, పెండెం వెంకటేశ్వర్లు,పాలూరి సత్యనారాయణ, బాగ్దాద్,వీరారెడ్డి, అశోక్,ఆలేటి సత్యనారాయణ, నెమ్మది దేవమని, శంకర్,సంజీవ్,బాబా తదితరులు పాల్గొన్నారు…………

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు టాలెంట్ టెస్టులు

Harish Hs

పదోన్నతి పొందిన ఏఎస్ఐకి సన్మానం

Harish Hs

TNR NEWS

వర్గల్ క్షేత్రంలో… వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు  – ఘనంగా స్వామివారి కల్యాణ మహోత్సవం  – విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం

TNR NEWS

*అదుపుతప్పి కారు బోల్తా.. ఒకరి మృతి* 

TNR NEWS

నూతన ఉపాధ్యాయుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న ఎస్ టి ఓ కొడంగల్ పై చర్యలు తీసుకోవాలి. టీఎస్ యుటిఎఫ్ డిమాండ్.

TNR NEWS