Tnrnews.in
తెలంగాణరాజకీయం

*కాంగ్రెస్ పార్టీకి రాజీనామా బి ఆర్ ఎస్. పార్టీలో చేరిక*

మహబూబాబాద్ జిల్లా, గూడూరు పట్టణ కేంద్రానికి చెందిన తండా శ్రీహరి గౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, మహబూబాబాద్ లో నిర్వహించిన దీక్ష దివాస్ కార్యక్రమంలో, మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మహబూబాబాద్ మాజీ శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో, విఫలమైందని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమిష్టి కృషితో కష్టపడాలని, వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నూకల సురేందర్, పట్టణ అధ్యక్షులు చీదురు వెంకన్న, సీనియర్ నాయకులు కటార్ సింగ్, మండల మాజి కో ఆప్షన్ సభ్యులు ఎండి. రహీం పాషా, బి ఆర్ఎస్ పార్టీ మండల ప్రచార కార్యదర్శి భూక్య సురేష్ నాయక్, గూడూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బోడ ఎల్లయ్య, సంపంగి రాములు, బొంతు రాములు, సొసైటీ డైరెక్టర్. ఎడ్లరమేష్ తదితరులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఘనంగా భాషా పండితుల ఆత్మీయ సమ్మేళనం

Harish Hs

తహసీల్దార్‌ కార్యయంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి

TNR NEWS

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి

TNR NEWS

మహిళల భద్రత కోసమే షీ టీమ్స్

Harish Hs

పలు కుటుంబాలను పరామర్శించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి

TNR NEWS

11న జరిగే మాదిగల ధర్మ యుద్ధ సమావేశం విజయవంతం చేయండి కళ్ళే పెళ్లి ప్రణయ్ దీప్ మహాజన సోషలిస్టు పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు

TNR NEWS