Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలి.  ప్రజా వాణి పిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి.  జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్.

  1. వికారాబాద్ జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఆసరా పెన్షన్, భూ సమస్య లపై (128 )ఫిర్యాదులను స్వీకరించారు.

ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాధాన్య పథకాలకు జిల్లా అధికారులు ప్రాధాన్యత క్రమంలో ఎప్పటికప్పుడు లక్ష్యాలను పూర్తిచేసేందుకు కృషి చేయాలని అన్నారు.

ముందుగా పర్మిషన్ తీసుకోకుండా గురుకుల స్కూల్స్,కాలేజీలలో ,పాటశాల లో ఎవ్వరిని కూడా అనుమతించరాదని, అనుమతి లేకుండా ఎవరైనా గురుకుల స్కూల్స్, కాలేజి లలో ప్రవేశించడం జరిగితే సొసైటి రూల్స్ కు విరుద్దమని ,కాబట్టి ఎవ్వరిని కూడా అనుమతించరాదని హెచ్చరించారు.

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రి ని వేగవంతం చేయాలనీ అధికారులకు ఆదేశించారు.

మధ్యాహ్న భోజనానికి సంబంధించి అంగన్వాడీలు, పాఠశాలలు, రెసిడెన్సి పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో ఎలాంటి చిన్న లోపం లేకుండా చూసుకోవాలని అన్నారు. అన్ని పాఠశాలలో సంక్షేమ వసతి గృహాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని సజావుగా అమలు చేయాలనీ అధికారులకు ఆదేశించారు.

సి.ఎం.కప్ క్రీడలను డిసెంబర్ 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు చేపడుతున్నందున ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు.డిసెంబర్, 7వ తేదీ నుండి 8వ తేదీ వరకు గ్రామపంచాయతీ స్థాయిలో క్రీడలు నిర్వహిOచాలని , అదే నెలలో 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు మండల స్థాయిలోను, 16వ తేదీ నుండి 21వ తేదీ వరకు జిల్లా స్థాయిలో క్రీడలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మండలాల ప్రత్యేక అధికారులు మండల స్థాయిలో జరిగే అన్ని అంశాలపై దృష్టి సారించి ప్రత్యేక చొరవ చూపించాలని అన్నారు. ముఖ్యంగా సంబంధిత శాఖల అధికారులు కిందిస్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఎక్కడ సమస్యలు వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు.

ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుదీర్, ట్రైని కలెక్టర్ ఉమా హారతి, ఆర్ డి ఓ వాసు చంద్ర, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

బాలల దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

Harish Hs

తెలంగాణాలో సూర్యుడు భగ.. భగ..

TNR NEWS

TNR NEWS

రైతులు నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి

Harish Hs

మాలల సింహగర్జనను జయప్రదం చేయండి.

Harish Hs

డ్రగ్స్ సైబర్ నేరాల పైన అవగాహన

Harish Hs