కౌటాల మండల కేంద్రంలోని విద్యుత్ వినియోగ దారులు బకాయిలు సకాలంలో చెల్లించాలని కాగజ్నగర్ ఏ ఏ ఓ రాజమల్లు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో పెండింగ్లో ఉన్న బకాయిలను పరిశీలించి సకాలంలో బిల్లు చెల్లించాలని, చెల్లించని వారి కనెక్షన్ కట్ చేశారు. ప్రతి ఒక్కరు సకాలంలో చెల్లించడం వలన అదనపు వడ్డీ భారం తగ్గుతుందని ఆయన అన్నారు. ఆయన వెంట ఫోర్ మెన్ నర్సింగరావు ఎఎల్ ఎం లు లక్ష్మణ్ , సుధాకర్ సిబ్బంది సుధాకర్, పెంటన్న ఉన్నారు..