మానకొండూర్: ఇటీవల జరిగిన జిల్లా స్థాయి సీనియర్ గర్ల్స్ బేస్ బాల్ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన మానకొండూర్ మండలం పోచంపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ పద్మశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు.ఈనెల 7 వ తేదీ నుంచి 9 వ తేదీ వరకు జగిత్యాల జిల్లాలో జరగబోయే సీనియర్ గర్ల్స్ బేస్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలకు మోడల్ స్కూల్ విద్యార్థులు మనోజ్ఞ,అక్షయ,శ్రీహర్షిత,మధుప్రియ,మధుశ్రీ,లక్ష్మీ ప్రసన్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు.రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన ఆరుగురు విద్యార్థులను మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ,వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ ఉయ్యాల విష్ణువర్ధన్,ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.