Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

రుణమాఫీలో కేంద్రం బాధ్యతలను విస్మరించడం తగదు… :- రైతు బిడ్డగా తెలంగాణా తల్లి విగ్రహం..  :- రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం :- కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్య

రైతులకు రుణమాఫీ చేసే విషయంలో ఒక రాష్ర్టానికే బాధ్యత ఉంటుందా కేంద్రానికి బాధ్యతలేదా అని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.యూపీఏ హయంలో రుణ మాఫీ విషయంలో కేంద్రమే బాధ్యత తీసుకుందని

కానీ బీజేపీ ప్రభుత్వం కేంద్రం తన భాత్యతల నుంచి తప్పుకుంటుందని ఆయన విమర్శించారు.

బీఆర్ ఎస్ ప్రభుత్వం తెలంగాణా తల్లి విగ్రహం రాచరిక వ్యవస్థకు అద్దం పట్టేలా రూపొందించారని దాని స్థానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బిడ్డను పోలి ఉండేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించామని చెప్పారు.ఆదివారం జీవన్ రెడ్డి జగిత్యాలలోని ఇందిరభవన్ లో విలేకరులతో మాట్లాడుతూకాంగ్రెస్ ప్రభుత్వ పాలన విజయవంతంగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

 

దేశంలో ఎక్కడ లేని విధంగా 200ల యూనిట్ల ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం, 500లకే సిలిండర్ పంపిణీ చేయడం జరుగుతుతుందన్నారు.ఈ పథకాల అమలుకు కోసం పది వేల కోట్లు రాష్ట్రం ప్రభుత్వం రాయితీ వెచ్చించిందని జీవన్ రెడ్డి వివరించారు.

తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు విషయంలో భారాస మిర్శలు తగవన్నారు.తెలంగాణ తల్లి అనేది సామాన్యుల తల్లి అన్ని వర్గాలకు అనుకూలంగా ఉందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లల్లో సొంత భవనాలు కట్టించే కార్యక్రమం చేపట్టిందన్నారు.

రైతులు పండించిన సన్న రక0 వరికి మద్దతు ధరతో పాటు 500ల బోనస్ ఇస్తున్న రాష్ట్రం ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో ను ఇవ్వడం లేదన్నారు.

 

మహిళా సంక్షేమం కోసం తెలంగాణా రాష్ట్రంలో ఎన్నో అమలు చేస్తున్నామని దేశంలో మీరెక్కడైన అమలు చేస్తున్నారా అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ చెప్పాలని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.క్రిషి విజ్ఞాన కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం పూర్తి నిర్వహణ చేస్తుందని చెబుతూ ఈ విజ్ఞాన కేంద్రాన్ని జగిత్యాలకు వచ్చే విధంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు.

సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్త మోహన్,జగిత్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య,జిల్లా యూత్ కాంగ్రెసు అధ్యక్షులు బీరం రాజేష్, బండ శంకర్, కౌన్సిలర్లు దుర్గయ్య, నక్క జీవన్,జగిత్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడలు జున్ను రాజేందర్,గుండా మధు, జగిత్యాల పట్టణ యూత్ కాంగ్రెసు అధ్యక్షులు తాటిపర్తి పరిక్షిత్ రెడ్డి, నాయకులు గాజుల రాజేందర్, ధర రమేష్ బాబు, ఎన్న0 మదూకర్ రెడ్డి, నల్ల స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

నేటి బాలలే రేపటి భావిభారత పౌరులు

Harish Hs

విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వ చెలగాటం స్కాలర్‌షిప్‌ నిధులివ్వాలి కళ్లకు గంతలతో ఏఐఎస్‌ఎఫ్‌ నిరసన

TNR NEWS

ఐదేళ్ళలో కోటిమందిని కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం : డాక్టర్ రామ్మూర్తియాదవ్*… *కాంగ్రెస్ విజయోత్సవ సభకు వరంగల్ తరలిన కాంగ్రెస్ నాయకులు

TNR NEWS

నిరుపేదల అపన్న హస్తం సీఎం సహాయనిది

TNR NEWS

కోదాడలో రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభం

Harish Hs

ఎమ్మార్పీఎస్ కలకోవ గ్రామశాఖ అధ్యక్షులుగా పాతకోట్ల బాలయ్య మాదిగ ఏకగ్రీవ ఎన్నిక

Harish Hs