బైక్ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చేవెళ్ల పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. షాద్ నగర్ కు చెందిన డప్పు అనంతయ్య(50) బుధవారం బైక్‌పై చేవెళ్లకు వచ్చి తిరిగి షాద్ నగర్ కు వెళ్తుండగా షాబాద్ రోడ్డులో డివైడర్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయలై రక్తస్రావాలు కాగా, చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అనంతయ్య మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.