కోదాడ కోదాడ పట్టణంలోని బాపూజీ శాఖా గ్రంధాలయానికి జిల్లా గ్రంధాలయ సంస్థ నిధుల నుండి తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. సోమవారం మరమ్మతు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయ భవనం పె చ్చులూడి పడుతుండ టం తో పాఠకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని గ్రంథాలయం చుట్టూ మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా నిరుద్యోగ యువకులు ఉద్యోగాల కోసం చదువుకునేందుకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గ్రంథాలయం లోపల కూడా మరమ్మతులు చేయించి రంగులు వేయిస్తానని అన్నారు . కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి మంగ, సిబ్బంది పత్ని,నాగమ్మ,బిక్షం తదితరులు పాల్గొన్నారు.