సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళ్లే మునగాల మండల ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని గురువారం మండల ఎస్సై ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.పండుగకు సొంతూళ్లకు వెళ్లిపోవడంతో పలు కాలనీలు, బస్తీల్లోని ఇళ్లకు తాళాలు వేస్తారని, దీనిని అసరాగా చేసుకుని దొంగలు రెచ్చిపోయి దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు.ఊరికి వెళ్లే ముందు ఇంట్లోని డబ్బు, బంగారం, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్ లో భద్రపరుచు కోవాలని, ఇంటికి తాళం వేసిన తరువాత తాళం కనిపించకుండా డోర్ కర్టెన్‌లను వేయాలని, గేటుకు తాళం లోపలివైపు నుండి వేసి జాగ్రత్త వహించాలని చెప్పారు.ఇంట్లో పగలు, రాత్రి చిన్న విద్యుత్ బల్బు వెలిగే లా ఏర్పాటు చేయాలని సూచించారు.మండల ప్రజలకు ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.