March 11, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

వేడుకల పేరిట డబ్బును వృధా చేయవద్దు

వేడుకల పేరిట డబ్బును వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలను పేదలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని మున్సిపల్ చైర్మన్ సామినేని ప్రమీల,రమేష్ అన్నారు. బుధవారం స్థానిక శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల అనాధ ఆశ్రమంలో అమెరికాలో ఉంటున్న కోదాడకు చెందిన తొగరు నవీన్, జ్యోతిల కుమార్తె ప్రాజ్ఞ పుట్టినరోజు సందర్భంగా మేనమామ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బరపటి కోటేశ్వరరావు తో కలిసి అనాధ పిల్లల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరిని ఆదర్శంగా తీసుకొని అనాధ పిల్లలకు చేయూతనిచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బరపటి కోటేశ్వరరావు, ఇమ్రాన్, నాగుల్, మనీ, సత్తార్, రాజేష్ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…….

Related posts

ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేత

Harish Hs

పంతానికి పోతే ఒకరే గెలుస్తారు… రాజీ పడితే ఇద్దరు గెలుస్తారు

TNR NEWS

రోడ్డు భద్రత మాస ఉత్సవ కార్యక్రమంలో నల్లబెల్లి పోలీస్ లు

TNR NEWS

సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ కి సన్మానం చేసి వీడ్కోలు తెలిపిన జిల్లా పోలీసు

TNR NEWS

అమ్మాపురంలో రైతు దినోత్సవం  రైతు దినోత్సవం రోజు రైతులకు సన్మానం 

TNR NEWS

ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి

TNR NEWS