స్థానిక బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ లో వసంత పంచమి గణనీయంగా జరిగింది. దీనిలో తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు, వైస్ ప్రిన్సిపాల్,సహ ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అక్షరమంటే నాశనం లేనిది విద్య యశస్సును,కీర్తిని పెంచుతుంది. విద్య విచక్షణనీ నేర్పుతుంది. విద్య సమాజాన్ని తీర్చుదిద్దుతుంది. అలాంటి అక్షరం మన జ్ఞానాన్ని పెంపొందించేలా దోహదం చేయాలి. అక్షరాభ్యాసం చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఆ సరస్వతీ కటాక్షం ఉండి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బెజ్జంకి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నేర్చుకున్న విద్య మన తల్లిదండ్రులకు పేరు తెచ్చేలా విద్యార్థికి కీర్తి పెంచేలా ప్రతి విద్యార్థి మంచి నడవడికతో ఉండాలని పాఠశాల వైస్ ప్రిన్సిపల్ పి ఎస్ ఎన్ శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.